Balakrishna : అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన బాలయ్య..!
Balakrishna : అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిని నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కాశీ విశ్వనాథ్..;
Balakrishna : అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిని నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కాశీ విశ్వనాథ్... నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన చిన్నప్పటినుంచి బాలకృష్ణ అభిమాని కావడంతో... ఆయనతో మాట్లాడాలని, కలవాలని కోరుకున్నారు.
దీంతో ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు సజ్జాద్ హుస్సేన్‌ను సంప్రదించడంతో... విషయం తెలుసుకున్న ఆయన... కాశీవిశ్వనాథ్‌లో ఫోన్‌లో వీడియోకాల్‌లో మాట్లాడారు. ధైర్యం చెప్పి... అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని సూచించారు.
ఎలాంటి సాయం కావాలన్న తాను అండగా ఉంటానని బాలకృష్ణ హామీ ఇవ్వడంతో... కాశీ విశ్వనాథ్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.