Nani : నాని ''దసరా'' మూవీ రిలీజ్ అప్పుడే.. ఎందుకంటే..
Nani : డిసెంబర్‌లో రిలీజ్ కానున్న నాని దసరా మూవీ..;
Nani : న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు టాలీవుడ్‌లో వన్ ఆఫ్ టాప్ యాక్టర్ అయినప్పటికీ చేతినిండా మూవీస్ లేవు. టక్ జగదీష్, అంటే సుందరానికి మూవీ బాక్సాఫీస్‌లో బోల్తాపడ్డాయి. శ్యాం సింగరాయ్, అంటే సుందరానికీ భారీ కలెక్షన్లు వస్తాయనుకున్నాడు న్యాచురల్ స్టార్. కానీ అవే సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో నాని ఆచి, తూచి అడుగులు వేస్తున్నారు.
నాని ప్రస్తుతం దసరా మూవీ మేకింగ్‌లో ఉన్నారు. తనకు డిసెంబర్ నెల బాగా కలిసొస్తుంది. అందుకోసం ఈ డిసెంబర్‌లోనే దసరా మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా దసరాలో రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు తన రాబోయే సినిమాను ఎలాగైనా సక్సెస్ చేయాలన్నది నాని బలమైన కోరిక.