Nani: నాని ఏంటి ఇలా మారిపోయాడు..! 'దసరా'తో మాస్ లుక్‌లో..
Nani: అదే తరహాలో డీ గ్లామర్ మాస్ రోల్‌లో కనిపించనున్నాడు నేచురల్ స్టార్ నాని.;
Nani: ఈరోజుల్లో హీరోలు క్లాస్‌గా మాత్రమే కనిపించాలి.. కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలి.. అనే లిమిట్స్ ఏమీ పెట్టుకోవడం లేదు. ప్రేక్షకులను మెప్పించడం కోసం ఎంత మేక్ ఓవర్‌కు అయినా ఓకే అనేస్తున్నారు. 'పుష్ప' కోసం అల్లు అర్జున్ అయితే పూర్తిగా డీ గ్లామర్ రోల్‌కు ఓకే చెప్పేశాడు. తాజాగా అదే తరహాలో డీ గ్లామర్ మాస్ రోల్‌లో కనిపించనున్నాడు నేచురల్ స్టార్ నాని.
నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ మినిమమ్ గ్యారెంటీ కథలనే ఎంచుకుంటాడు. ఒకవేళ కథ సాదాసీదాగా ఉన్నా.. తన యాక్టింగ్‌తో సినిమాను నిలబెట్టగల ప్రతిభ నాని సొంతం. అయితే ఈ మధ్య నాని కూడా తన కంఫర్ట్ జోన్ దాటి ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తన చివరి చిత్రం 'శ్యామ్ సింగరాయ్'ను పునర్జన్మ అనే కాన్సెప్ట్‌తో చేశాడు. ఇక ప్రస్తుతం పూర్తిగా మాస్ లుక్‌తో రెడీ అవుతున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో అందరికంటే స్పీడ్‌గా సినిమాలు చేసేది ఎవరు అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు నాని. ఈ హీరో ఏడాదికి కనీసం మూడు సినిమాలు అయినా విడుదల చేస్తుంటాడు. డిసెంబర్‌లో శ్యామ్ సింగరాయ్‌తో పలకరించిన నాని.. ఏప్రిల్‌లో 'అంటే సుందరానికి' విడుదల చేయనున్నాడు. ఆ తర్వాత 'దసరా'తో సిద్ధంగా ఉన్నాడు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రమే 'దసరా'. ఇందులో నానికి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. అయితే తాజాగా ఇందులో నుండి నాని క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఇందులో నాని పూర్తిగా డీ గ్లామర్‌గా, మాస్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే దసరాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలనుకుంటుందట మూవీ టీమ్.
Dharani from #DASARA
— Nani (@NameisNani) March 20, 2022
RAGE IS REAL 🔥#SparkofDasara 👇🏼https://t.co/06QUaXXGyb pic.twitter.com/82ITCb0jRY