నాని నాన్ స్టాప్ గా చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీస్ నుంచి ఏం వచ్చింది..? అంటే మాత్రం ఏం లేదు అనే చెప్పాలి. అతనికి ఆ స్థాయిలో మార్కెట్ సెట్ చేసుకోవాలనే ప్లాన్ ఉంది. కోరిక కూడా బలంగా ఉంది. బట్ ఆ స్థాయిలో వసూళ్లు మాత్రం సాధ్యం కావడం లేదు అని ఖచ్చితంగా చెప్పాలి. ప్రధానంగా ఆ కోరిక శ్యామ్ సింగరాయ్ నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆ ప్రయత్నాలు అలాగే కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో చేసిన అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 వరకూ ఆ రేంజ్ మూవీస్ కోసం ప్రయత్నాలు మాత్రం సాగిస్తూనే ఉన్నాడు. బట్ ప్యాన్ ఇండియా హీరో అని మాత్రం ఇప్పటి వరకూ అనిపించుకోలేదు అనేది నిజం.
నానికి ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ భిన్నమైనది. కేవలం ఒక భాషకే పరిమితమైన హీరోగానే మిగిలిపోయాడు. దాన్ని దాటుకుని ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించాలనే ప్రయత్నాలు బాగా సాగిస్తున్నాడు. బట్ ఇది సాధ్యం కావడం లేదు. శ్యామ్ సింగరాయ్ నుంచి మొదలైన ఈ ప్రయత్నంలో అతను చేసిన పనులు ఏవీ మెప్పించలేదు. ఓ రకంగా ఆ స్థాయిలో అతను ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆ ఇమేజ్ కోసం చేసిన ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్ అంటూ హడావిడీ కనిపిస్తుందే తప్ప.. వాస్తవంగా మాత్రం ఆ స్థాయిలో బిజినెస్ కావడం లేదు. ఈ విషయంలో నాని ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. కెరీర్ మొదటి నాళ్లలో ఒకటీ రెండు తమిళ్ మూవీస్ లో కనిపించాడు. బట్ ఆ తర్వాత ఆ మూవీస్ నుంచి ఎలాంటి మైలేజ్ రావడం లేదు. అలాంటిది ఇక హిందీ మార్కెట్, కన్నడ, మళయాలం మార్కెట్ పై ఫోకస్ చేయడం సాధ్యం అవుతుందా అంటే ఇప్పటి వరకూ కాలేదు అనేది వాస్తవం.
నానికి ఇప్పటి వరకు ఉన్న తెలుగు మార్కెట్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఓటిటిల్లో మాత్రం అద్భుతంగా అదరగొడుతున్నాడు. సినిమాలు మొదలైన టైమ్ నుంచి ఓటిటిల్లో మంచి మార్కెట్ లకు అమ్ముడు పోతున్నాయి మూవీస్. ఈ మధ్య కాలంలో ద ప్యారడైజ్ మూవీతో పాటు ఇంకా మొదలే కానీ బ్లడీ రోమియో మూవీస్ ఆల్రెడీ ఓటిటికి భారీ ధరలకు అమ్ముడు పోయాయి. బట్ ప్యాన్ ఇండియా స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ విషయంలో ఇది కుదరడం లేదు. మరి ఇకపై చేస్తున్న ద ప్యారడైజ్ తో పాటు సుజీత్ డైరెక్ట్ చేయబోతున్న బ్లడీ రోమియో మూవీస్ అయినా ఆ మార్కెట్ లో అతను సత్తా చాటుతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.