Teja Sajja : తేజ సజ్జా.. జాంబిరెడ్డి 2 వస్తోంది.. బట్

Update: 2026-02-25 11:35 GMT

తేజ సజ్జా సినీ ప్రయాణం సాగిస్తున్న విధానం చాలా బావుంది. వేగంగా సినిమాలు చేయడం లేదు. ఒక్కో సినిమాకు రెండేళ్లో, మూడేళ్లు టైమ్ తీసుకుంటున్నాడు. హను మాన్ మూవీతో ప్యాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకున్నాడు. మిరాయ్ తో ఆ రేంజ్ కంటిన్యూ చేశాడు. తర్వాత అతని మూవీ ఏంటీ అంటే జాంబిరెడ్డి 2 రెడీ అవుతోంది. 2021లో రూపొందిన జాంబిరెడ్డి అప్పట్లో పెద్ద విజయం సాధించింది. అయితే జాంబీస్ పై కామెడీగానే సినిమా రూపొందించారు. అయినా అందులోనూ కాస్త సీరియస్ నెస్ యాడ్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీ సాధించిన విజయం మాత్రం విశ్లేషకులను కూడా ఆశ్చర్య పరిచింది. అయితే అదే యేడాది తేజ సజ్జా నుంచి ఇష్క్, అద్భుతం అనే రెండు డిజాస్టర్స్ వచ్చాయి. అయితేనేం.. మూడేళ్ల గ్యాప్ తీసుకుని హను మాన్ తో అదరగొట్టాడు. 2025లో విడుదలైన మిరాయ్ కూడా పెద్ద హిట్టే అయింది. ఆ తర్వాతేంటీ అనే ప్రశ్నకు సమాధానంగానే ఇప్పుడు జాంబిరెడ్డి 2.

జాంబిరెడ్డి 2 కు ప్రశాంత్ వర్మ కథ అందించాడు. అయితే దర్శకుడు మాత్రం వేరే వారిని తీసుకుంటాడట. ఎందుకంటే అతనిప్పుడు రిషబ్ శెట్టి హీరోగా జై హను మాన్ తో రెడీ అవుతున్నాడు. అందుకే జాంబిరెడ్డి 2ను మరో దర్శకుడి చేతిలో పెట్టాలానుకున్నాడు. మరి కొత్త దర్శకుడు ఎవరు అనే ప్రశ్నకు అప్పుడే సమాధానం చెప్పలేకపోతున్నాడు. లేదంటే ఆల్రెడీ అతన్ని సెలెక్ట్ చేసినా అనౌన్స్ చేయలేదు అనుకోవచ్చు.

ఇక ఈ మధ్య వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్నాడు టి.జి విశ్వ ప్రసాద్ ఈ మూవీని నిర్మించబోతున్నాడు. ఇప్పటికైతే స్క్రిప్ట్ లాక్ చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రకటించబోతున్నారు. మరి ఈ మూవీతో తేజ సజ్జా ఎంత టైమ్ తీసుకుంటాడో తెలియదు కానీ.. ఖచ్చితంగా ఈ సారి బిగ్ స్కేల్ లోనే సినిమా రూపొందించబోతున్నారు అనేది మాత్రం తెలిసింది. 

Tags:    

Similar News