Nani : నానికి అంత దమ్ముందా..?

Update: 2026-02-05 10:28 GMT

నేచురల్ నానిగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్నాడు. ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే పేరుంది. ఇప్పుడు మెల్లగా అది వదిలించుకుంటున్నాడు. మాస్ హీరోగా మారుతున్నాడు. ఎంచుకున్న కథలే అతన్ని మాస్ హీరో అనిపించుకుంటున్నాయి. అలాగే అప్పుడప్పుడూ క్లాస్ మూవీస్ తో కూడా ఆకట్టుకుంటున్నాడు. అలాంటి హీరోలో ఇంత దమ్ముందా అనిపించేలా ఒక టాస్క్ ఫినిష్ చేశాడు. ఇంకా చెబితే అతనికంటే చాలా పెద్ద హీరోలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినా నాని మాత్రం అదరగొడుతున్నాడు అంటే చిన్న విషయమేం కాదు. ఇంతకీ అతనిలో అంత దమ్ము ఎలా వచ్చింది..?

యస్ నానిలో నిజంగా దమ్ముంది అనిపించే ఉదంతాలు ఇవి. అతనిప్పుడు ద ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. తర్వాత వెంటనే సుజీత్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. అతను బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనే మాట ఎప్పటి నుంచో ఉంది కదా. అయితే ఈ రెండు సినిమాల బడ్జెట్ లు మాత్రం కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి. ద ప్యారడైజ్ తో పాటు సుజీత్ మూవీస్ కు 350 - 380 కోట్ల మధ్య ఉందట. అంటే భారీ బడ్జెట్ మూవీస్ అనే చెప్పాలి. మరి అంత భారీ బడ్జెట్ మూవీస్ ను రికవర్ చేసే సత్తా ఉందా నానిలో అంటే ఉంది అనేదే అసలు విషయం ఇప్పుడు.

భారీ బడ్జెట్ చిత్రాలు అయినా ఆ రెండు సినిమాల బడ్జెట్ ను నాన్ థియేట్రికల్ నుంచే ఏకంగా 90శాతం రాబట్టేశాడు నాని. యస్.. ఇది నిజమే. ఈ రెండు సినిమాల నుంచి ఆ మొత్తాన్ని 90 శాతం వరకు నాన్ థియేట్రికల్ నే సాధించాడు అంటే చిన్న విషయం కాదు. అంటే ఈ మూవీస్ కు థియేట్రికల్ వచ్చే డబ్బంతా దాదాపు లాభాలుగానే కనిపిస్తుంది. ఈ మధ్య బిగ్ స్టార్స్ కు కూడా ఇది సాధ్యం కావడం లేదు. అలాంటిది నాని ఆ సత్తా చూపించాడు అంటే అతనిలో ఎంత దమ్ము ఉంటే సాధ్యం అవుతుంది. చూస్తుంటే అతనిక టైర్ 2 హీరో మాత్రం కాదు అనాల్సిందే. టాప్ హీరోల లిస్ట్ లో నిలబడే సత్తా ఉన్నవాడుగా కనిపిస్తున్నాడు. సింపుల్ గా చెబితే నాని ఇక ఎంత మాత్రం టైర్ 2 హీరో కాదు. నానికి నిజంగా అంత దమ్ము ఉంది. 

Tags:    

Similar News