National Cinema Day: సినిమా నా డిఎన్ఏలో ఉంది.. సితార భావోద్వేగ పోస్ట్..
జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా, మహేష్ బాబు కుమార్తె సితార తన తాత కృష్ణ వదిలిపెట్టిన వారసత్వంలో భాగమైనందుకు ఒకింత గర్వంగా, చాలా కృతజ్ఞతగా ఉన్నానని తెలిపింది.;
National Cinema Day: జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా, మహేష్ బాబు కుమార్తె సితార తన తాత కృష్ణ వదిలిపెట్టిన వారసత్వంలో భాగమైనందుకు ఒకింత గర్వంగా, చాలా కృతజ్ఞతగా ఉన్నానని తెలిపింది.
తాత, తండ్రి అందం, వినయం, మంచితనం కలబోసి పుట్టిన సితార.. పువ్వు పుట్టగానే పరిమళించనట్లు చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంటోంది. చదువుతో పాటు కొన్ని ప్రకటనలలో నటిస్తోంది. సినిమాల్లోకి రావాలనే తన కోరికను ఇదివరకే వ్యక్తపరిచింది.
సితార ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ రాసింది
సితార తన తాత, కృష్ణ ఘట్టమనేని, తండ్రి, మహేష్ బాబు , తల్లి, నమ్రతా శిరోద్కర్, సోదరుడు గౌతమ్ ఘట్టమనేని-అందరూ కలిసి ఉన్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
“సినిమా - నా జీవితంలో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న పదం. ఇది నాకు పరిశ్రమ కాదు. ఇది నా DNAలో ఒక భాగం,” అని సితార తన సుదీర్ఘ పోస్ట్‌లో వ్యక్తపరిచింది.
“వెండితెరలో ఒక టైటాన్ అయిన మా నాన్న, తన తండ్రి తనకు ఎలా ఉండేవాడో, అలాగే నాకు ఎప్పుడూ స్ఫూర్తి. లెజెండరీ ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణగా ప్రపంచానికి తెలిసిన నా తాతగారు, మా అందరిపై గాఢమైన ప్రభావం చూపారు. మా నాన్నగారి కోసం, నా సోదరుడి కోసం ఆయన విడిచిపెట్టిన ఈ వారసత్వంలో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు. నా కుటుంబ సినీ ప్రయాణాన్ని ఇష్టపడి ఆదరిస్తున్న మీ అందరికీ. #నేషనల్ సినిమా డే,”శుభాకాంక్షలు అని పేర్కొంది.
జాతీయ సినిమా దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు?
జాతీయ సినిమా దినోత్సవాన్ని మొదటగా 2022లో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) రూపొందించింది. COVID-19 మహమ్మారి తర్వాత సినిమా హాళ్లను తిరిగి తెరిచిన జ్ఞాపకార్థం MAI జాతీయ సినిమా దినోత్సవాన్ని ప్రారంభించింది. COVID-19 మహమ్మారి సమయంలో భారీ నష్టాలను చవిచూసిన సినిమా హాల్ యజమానులకు మద్దతుగా సినీ ప్రేక్షకులను ప్రోత్సహిస్తూ ఈ రోజున సినిమా టిక్కెట్లపై గణనీయమైన తగ్గింపులను అందించాలని అసోసియేషన్ నిర్ణయించింది.
12 ఏళ్ల సితార తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. అనీ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఇటీవల, సితార ఒక నగల బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. అందుకున్న పారితోషికాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించింది.
2019లో వచ్చిన ఇంగ్లీష్ ఫాంటసీ చిత్రం ఫ్రోజెన్ 2 యొక్క తెలుగు వెర్షన్‌లో బేబీ ఎల్సా పాత్రకు సితార తన వాయిస్ ని అందించింది. ఆమె దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తెతో కలిసి ఆద్య & సితార అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతోంది. దీనికి 280K మంది సబ్ స్క్రైబర్ లు ఉన్నారు.