National Film Awards 2023: 'ఆర్ఆర్ఆర్' కు అవార్డుల పంట
జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన 'ఆర్ఆర్ఆర్';
69వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఈరోజు ఆగస్టు 24, 2023న ప్రకటించారు. దర్శక ధీరుడు SS రాజమౌళి రూపొందించిన 'RRR'ఇప్పటికే ఎన్నో అవార్జులు అందుకోగా.. ఇప్పుడు జాతీయ అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఈ మూవీ అనేక ప్రధాన విభాగాలలో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరం అనౌన్స్ చేసిన 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడు 'RRR' టీమ్ మరోసారి అవార్డుల పంట పండించింది. ఈ చిత్రానికి ఏకంగా 5 జాతీయ చలనచిత్ర అవార్డులు వచ్చాయి.
ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ (గాయకుడు)
హోల్సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉత్తమ చిత్రం
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డు
ఉత్తమ కొరియోగ్రఫీ
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్
ఉత్తమ సంగీత దర్శకత్వం అవార్డు
'RRR' గురించి
SS రాజమౌళి దర్శకత్వం వహించిన 'RRR' మార్చి 25, 2022న థియేటర్లల్లో విడుదలైంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
'RRR' అనేది కల్పిత పీరియాడిక్ డ్రామా. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు వరుసగా ఇద్దరు తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రలలో నటించారు. అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, సముద్రకని వంటి నటులు పలు పాత్రల్లో అలరించారు.