Balakrishna : ఫస్ట్ టైమ్ బాలయ్య తక్కువ మాట్లాడాడు

Update: 2024-12-02 09:00 GMT

నందమూరి బాలకృష్ణ టాక్ షో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతూనే ఉంది. అన్ స్టాపబుల్ అంటూ ఆహాలో ప్రస్తుతం 4వ సీజన్ సాగుతోంది. ఈ సీజన్ ఎక్కువగా ప్రమోషన్స్ కే పరిమితం అయిందనే విమర్శలున్నా.. తనదైన టైమింగ్ తో అదరగొడుతున్నాడు బాలయ్య. ప్రమోషన్స్ తో పాటు పర్సనల్ విషయాలను కూడా రాబడుతూ.. ఆ షో ఆద్యంతం వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ బాలయ్య తన గెస్ట్ లను మాట్లాడించేందుకు తనే ఎక్కువగా మాట్లాడేవాడు. బట్ ఫస్ట్ టైమ్ ఆయన డైలాగ్స్ తగ్గాయి. అందుకు కారణం నవీన్ పోలిశెట్టి. నవీన్ తో పాటు శ్రీ లీలను గెస్ట్ లుగా పిలిచారీ ఎపిసోడ్ కి. మామూలుగా మాంచి మాటకారి అయిన నవీన్ మాటలతో బాలయ్యను డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు. అటు శ్రీ లీలపైనా సూపర్ పంచ్ లు వేస్తూ నవ్వించేశాడు.

‘మీరూ ఎమ్మెల్యే నేనూ ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్, కుర్చీ మడతపెట్టి సాంగ్ ను క్లాసికల్ స్టైల్లో ట్రై చేద్దాం.. చిప్స్ తిన్నోడికి సిక్స్ ప్యాక్ ఎక్కడి నుంచి వస్తుందిరా అసలు, ఎమ్ఎమ్.బి.ఎస్ లో మూడు మెయిన్ సబ్జెక్ట్స్.. ఫస్ట్ ఇయర్ కుర్చీ మడతపెట్టి, సెకండ్ ఇయర్ జింతాక, థర్డ్ ఇయర్ కిస్సిక్.. ’ ఇవీ నవీన్ పోలిశెట్టి చెప్పిన డైలాగులు, హంగామా. పైగా ఈ ప్రోమో కేవలం ఒకటిన్నర నిమిషం మాత్రమే ఉంది. ఫుల్ ఎపిసోడ్ లో మనోడు ఇరగదీస్తాడేమో కానీ.. మొత్తంగా చాలా రోజుల తర్వాత బాలయ్య తక్కువగా మాట్లాడుతూ.. ఎక్కువగా ఎంజాయ్ చేశాడు. 

Tags:    

Similar News