ఓ వైపు సోలో హీరోయిన్ గా ఆకట్టుకుంటూనే రెగ్యులర్ హీరోయిన్ గానూ ఆకట్టుకుంటోంది నయనతార. వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటోంది. ఓ వైపు చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మూవీలో కూడా ఆకట్టుకునే హీరోయిన్ గా మెప్పించబోతోంది. తాజాగా టాక్సిక్ మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ చూడగానే మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. తను ఈ మధ్య కాలంలో ఇంత మోడ్రన్ గా కనిపించేలాంటి పాత్రలు చేయలేదు. ఓ చేతిలో తుపాకీ పట్టుకుని థైస్ షోతో పాటు సిజిలింగ్ లుక్ తో ‘గంగ’అనే పాత్రలో కనిపిస్తోంది. తను చేసిన పాత్రల్లోని గొప్పదనం కూడా కనిపించేలాంటి లుక్ తో కనిపిస్తోంది. ఇద్దరు పనిమనుషులను గేట్ తీయగా తను సీరియస్ గా వెళుతోన్న లుక్ తో ఈ ఫోటో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ తరహా పాత్రల్లో కూడా నయన్ అదరగొడుతోంది అనిపించేలా ఉంది.
గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో చాలామంది కీలకమైన నటీ నటులు కనిపించబోతున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత యశ్ హీరోగా నటించబోతున్నాడు. నయనతారతో పాటు కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ, రుక్మిణీ వసంత్, టోవినో థామస్ వంటి స్టార్ లే కనిపిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించబోతున్నాడు. 19 మార్చి 2026న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరి ఇందులో గంగ పాత్రలో నయనతార ఏ రేంజ్ లో కనిపించబోతోంది అనేది చూడాలి.