Nayanthara : అలాంటి వారికి నయనతార స్వీట్ కౌంటర్

Update: 2025-07-10 10:30 GMT

ఎప్పుడూ న్యూస్ లో నిలిచే బ్యూటీస్ లో నయనతార కూడా ముందే ఉంటుంది. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు నిరంతరం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. అందుకు కారణాలు తన పాత బ్రేకప్ లు, ప్రేమాయణాలూ అనేది ఒప్పుకుని తీరాలి. చివరగా విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు. ఆ పిల్లలతో కలిసి హ్యాపీగా టూరేగుతూ కనిపిస్తుంటుందీ జంట. ఆ టూర్స్ లో గ్యాప్ వస్తే చాలు.. ఏవేవో గాసిప్ లు వస్తుంటాయి. అలా కొన్ని రోజులుగా నయన్, విఘ్నేష్ విడిపోతున్నారు అనే న్యూస్ వచ్చింది. నయన్ గురించి తెలుసు కాబట్టి చాలామంది ఇది నిజమే అని భావించారు. నిజానికి ఇలాంటి వార్తలు తనకు కొత్తేం కాదు. అయినా ప్రతిసారీ వివరణ ఇస్తూనే ఉంటుంది. ఈ సారి కూడా అంతే.. అయితే ఇదో స్వీట్ కౌంటర్ ఉండటం విశేషం.

ఒక పార్క్ లో భర్త విఘ్నేష్ శివన్ పడుకుని ఉండగా అతని వీపుపై కూర్చుని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘మా గురించి పనికిమాలిన వార్తలు చూసిన ప్రతిసారీ మా రియాక్షన్ ఇలానే ఉంటుంది’.. అనే క్యాప్షన్ జోడించింది. సో.. ఓ రకంగా తమ గురించి రూమర్స్ స్ప్రెడ్ చేసిన వారికి ఇది మరో స్వీట్ కౌంటర్ అనుకోవచ్చు. ఎలాంటి పరుష పదాలు వాడకుండానే అందరికీ కౌంటర్ ఇచ్చింది నయన్. సో.. ఈసారికి విడిపోవడం లేదు అని రాసుకోవచ్చు. అదన్నమాట సంగతి. 

 

Tags:    

Similar News