నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ చిత్రీకరణ చివరి దశలో ఉందీ మూవీ. బాబీ ఇంతకు ముందు చిరంజీవితో వాల్తేర్ వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ మూవీపై అంచనాలున్నాయి. అఫ్ కోర్స్ ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ తోనే ఆ అంచనాలు పెంచారు. బాబీ డియోల్ విలన్ గా నటించిన ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి ఫీమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. బాలయ్య ఇంతకు ముందెప్పుడూ కనిపించని కంటెంట్ తో రాబోతున్నాడని చెబుతున్నారు. అన్నీ కుదిరితే సంక్రాంతికి విడుదల చేస్తాం అంటున్నారు. కానీ బాలయ్య పోర్షన్ కు సంబంధించిన షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉందట. ఆ కారణంగా సంక్రాంతికి డౌటే అంటున్నవాళ్లూ ఉన్నారు.
ప్రస్తుతం ఎన్.బి.కే 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ టైటిల్ ను దీపావళికి అనౌన్స్ చేయబోతున్నారని టాక్. ఈ మూవీ టైటిల్ కోసం బాలయ్య ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్యకు కథ రాయడం ఎంత సవాలో.. ఓ పవర్ ఫుల్ టైటిల్ పెట్టడం కూడా అంత సవాల్ మేకర్స్ కి. అందుకే ఈ మూవీ టైటిల్ ఏం పెట్టబోతున్నారా అని ఎదురుచూస్తున్నవారికి దీపావళితో ఆ ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడుతుంది. దీంతో పాటు ఓ మంచి టీజర్ కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీపావళికి టీజర్ వచ్చిందంటే సినిమా సంక్రాంతికి రావడం పక్కా. సో.. టైటిల్ తో పాటు టీజర్.. ఈ దీపావళికి బాలయ్య ఫ్యాన్స్ టపాసులు మరింత గట్టిగా పేల్చేస్తారేమో ఇంక.