NTRNeel : ఎన్టీఆర్ - నీల్.. నో అప్డేట్

Update: 2025-05-17 11:15 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇద్దరూ ప్యాన్ ఇండియా రేంజ్ లో స్టార్ ఇమేజ్ ఉన్నవాళ్లే. పైగా ప్రశాంత్ నీల్ కు మాస్ పల్స్ బాగా తెలుసు. సినిమాలో హీరో కనిపించే ప్రతి సీన్ నూ ఎలివేట్ చేసే సత్తా ఉన్న దర్శకుడు. ఎన్టీఆర్ మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు. పైగా ఏ పాత్రైనా చేయగల గ్రేట్ యాక్టర్ కూడా. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలుంటాయి కదా. అదే టైమ్ లో స్పెషల్ డేస్ లో అప్డేట్స్ ను కూడా ఎక్స్ పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. అలా ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఓ వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేస్తారు అనే ప్రచారం బాగా జరగడంతో అది నిజమే అనుకుంటున్నారు చాలామంది. బట్ వారి ఆశలపై నీల్ నీళ్లు చల్లాడు. ఈ మేరకు ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ తమ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

‘అభిమానులూ.. మనకు ఎన్నో అంతులేని ఆనందాలను ఇచ్చిన వ్యక్తి బర్త్ డే ను మీరు ఎంత గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారో మాకు తెలుసు. అయితే వార్ 2 కంటెంట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ ఆనందాన్ని అలాగే ఉంచాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఎన్టీఆర్ - నీల్ మూవీ నుంచి వచ్చే మాస్ మిస్సైల్ ను తర్వాత విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ యేడాది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను పూర్తిగా వార్ 2కే ఇవ్వాలనుకుంటున్నాం.. ’ అని ఎన్టీఆర్ నీల్ అనే పేరుతో ఉన్న అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు.

సో.. ఈ మూవీ నుంచి యంగ్ టైగర్ బర్త్ డేకు ఎలాంటి స్పెషల్ సర్ ప్రైజ్ లేదని తేలిపోయినట్టే. ఇక వార్ 2 కోసం చూడటమే.

Tags:    

Similar News