Acharya Movie : 'నీలాంబరి' ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ వచ్చేసింది..!

Acharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'... కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌గా నటిస్తోంది.

Update: 2021-11-05 06:45 GMT

Acharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'... కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. రామ్ చరణ్ సిద్దా అనే కీలకపాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన పూజ హెగ్డే నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నారు.


కాగా దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ ప్రోమోను నిన్న రిలీజ్ చేయగా, ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ ని ఈ రోజు రిలీజ్ చేశారు. దీనితో పాటు సాంగ్‌ మేకింగ్‌ సీన్స్‌తో వీడియోను వదిలారు. 'నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి అంటూ సాగే ఈ పాట‌లో రామ్ చ‌ర‌ణ్ త‌న డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. పూజ లుక్స్ బాగున్నాయి.


మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి - రమ్య బెహ్రా కలిసి ఆలపించారు. 

Full View


Tags:    

Similar News