Acharya : 'నీలాంబరి' ప్రోమో సాంగ్ వచ్చేసింది...!
Acharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'... కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.;
Acharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'... కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ చరణ్ సిద్దా అనే కీలకపాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన పూజ హెగ్డే నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నారు. కాగా దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను వదిలారు మేకర్స్.. 'నీలాంబరి' అంటూ సాగే ఈ పాటలో రామ్ చరణ్ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. పూజ లుక్స్ బాగున్నాయి. ఫుల్ సాంగ్ ని రేపు ఉదయం 11 గంటలకి రిలీజ్ చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.