Akhanda 2 : నెట్ ఫ్లిక్స్ చేతికి అఖండ 2 రైట్స్ ..

Update: 2025-09-11 10:34 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న మూవీ ‘అఖండ 2 తాండవం’. అఖండకు సీక్వెల్ గా రూపొందుతోన్నఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. బోయపాటితో బాలయ్య చేస్తోన్న నాలుగో సినిమా ఇది. దీంతో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారంగానూ ఉంటుందనుకుంటున్నారు. ఈ సారి ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ప్రగ్యా జైశ్వాల్ తో పాటుసంయుక్త, హర్షాలీ మల్హోత్రా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆ మధ్య వచ్చిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నెల 25నే విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఓ.జితో పోటీ ఇవ్వకుండా వెనక్కి తగ్గారేమో అనుకున్నారు. బట్ ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాలేదట. అందుకే డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నారు అనే డేట్ వినిపిస్తోంది. డేట్ అదే కాకపోయినా డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే సినిమా రాబోతోంది.

ఇక ఈ మూవీ ఓటిటి డీల్స్ భారీ ధరకు ఫైనల్ అయ్యాయి. బాలయ్య కెరీర్ లోనే ఇదే హయ్యొస్ట్ ఓటిటి డీల్ అని కూడా చెప్పొచ్చు. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ రైట్స్ ను 80 కోట్లకు దక్కించుకుంది. సౌత్ తో పాటు హిందీలోనూ ఇదే సంస్థ చిత్రాన్ని స్ట్రీమ్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ కు గొప్ప రెస్పాన్స్ రావడం.. సీక్వెల్ పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉండటమే ఈ రేంజ్ రేట్ రావడానికి కారణం. విశేషం ఏంటంటే.. ఓటిటి సంస్థలు కొన్నాళ్లుగా సినిమాలకు భారీ ధర పెట్టేందుకు బాగా ఆలోచిస్తున్నాయి. అయినా బాలయ్య సినిమాకు ఈ ధర పెట్టారు అంటే సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News