Raviteja : మాస్ జాతర ఓటిటి డీల్ సెట్

Update: 2025-07-17 12:00 GMT

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా మాస్ జాతర. మనదే ఇదంతా అనేది క్యాప్షన్. ఇది రవితేజ ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇడియట్ సినిమాలోని డైలాగ్ కావడం విశేషం. భాను భోగవరపు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఆల్రెడీ శ్రీలీల సెకండ్ తెలుగు సినిమా ధమాకాలో రవితేజతో నటించింది. దీంతో ఈ జంటపై మంచి క్రేజ్ ఉంది. ధమాకాలో శ్రీ లీల డ్యాన్స్ లకు యూత్ మొత్తం ఫిదా అయ్యారు. ఆ తర్వాతే ఆమెకు తెలుగులో ఆఫర్స్ వెల్లువెత్తాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన ఇంటర్డక్షన్ వీడియో కూడా వైరల్ అయింది. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే మంచి యాక్షన్ కూడా ఉండబోతోందనేలా ఉందా వీడియో.

ఇక ఈ చిత్రాన్ని సమ్మర్ లోనే విడుదల చేయాలనుకున్నారు. కుదరలేదు. మధ్యలో మరో డేట్ అనుకున్నారు. ఆ టైమ్ కు హరిహర వీరమల్లు వస్తుందని మళ్లీ వాయిదా వేశారు. హరిహర రాలేదు. అయినా మాస్ జాతర వాయిదా తప్పలేదు. ఫైనల్ గా ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. ఆ మేరకు ఆ డేట్ లో ఎలాంటి మార్పూ ఉండదని టాక్. ఇక ఈ మూవీ ఓటిటి డీల్ సెట్ అయింది. నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ మాస్ జాతరను 20 కోట్లు పెట్టి తీసుకుందంటున్నారు. రవితేజ సినిమాలు ఈ మధ్య బాగా నిరాశపరుస్తున్నాయి. అయినా ఈ ఫిగర్ అంటే చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. సో.. సితార బ్యానర్ కు ఈ మేరకు కొంత ప్లస్ అయిందనే చెప్పాలి.

Tags:    

Similar News