రెబల్ స్టార్ ప్రభాస్ మూవీస్ విషయంలో ఈ మధ్య కాస్త ఎక్కువ జాగ్రత్త పడుతున్నాడు. ముఖ్యంగా రాజా సాబ్ తర్వాత అతను ఎంచుకున్న కథల్లో కాస్త క్వాలిటీ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ క్రమంలో ఫౌజీ, స్పిరిట్ మూవీస్ కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలతో మరోసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను పూర్తి స్థాయిలో శాటిస్ఫై చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నాడు. కల్కి 2 పై మాత్రం ఈ సారి కూడా మిక్స్ డ్ రివ్యూస్ వచ్చేలా ఉన్నాయి. అందుకు కారణం కమల్ హాసన్ తో పాటు అమితాబ్ బచ్చన్. ఈ సారి కూడా ఆ ఇద్దరు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అలాగే స్పిరిట్ తో పాటు ఫౌజీ కూడా చిత్రీకరణలో ఉన్నాయి. ఈ టైమ్ లో హొంబలే ఫిల్మ్స్ తో ప్రభాస్ అగ్రిమెంట్ అనే టాక్ గతంలోనే వినిపించింది. అది కూడా ఒకేసారి మూడు సినిమాలు చేయబోతున్నాడు అనేదే ఆ అగ్రిమెంట్. అందుకు తగ్గట్టుగా ముగ్గరు డైరెక్టర్స్ ను ఫైనల్ చేశారు. ఈ ముగ్గురు దర్శకులతో హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై మూడు సినిమాలు చేస్తాడు.
హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చే ఫస్ట్ మూవీ సలార్ 2. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందే సినిమా ఇది. ఓ రకంగా ఆ బ్యానర్ కోసమే ప్రభాస్ కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు అనే టాక్ కూడా ఉంది. ఇప్పుడైతే అంతా సెట్ అవుతుంది. ఇటు ప్రభాస్ మూడు సినిమాలు కంప్లీట్ చేయడం.. అటు ప్రశాంత్ నీల్ కూడా సెట్ అవుతాడు. అతను ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు కథ కూడా కంప్లీట్ గా రెడీ చేసే పనిలో ఉండబోతున్నాడు.
హొంబలే బ్యానర్ లో రెండో సినిమాగా మళయాల దర్శకుడు దింజిత్ అయ్యతన్ తో ఉండబోతోంది. ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఈ డైరెక్టర్ కొట్టేశాడు. ఇంతకు ముందు కిష్కిందకాండమ్ అనే మూవీతో బాగా ఆకట్టుకున్నాడీ దర్శకుడు. విమర్శకుల సైతం ఆకట్టుకుందీ మూవీ. ఈ మూవీతో ప్రభాస్ ను తనలోని కొత్త యాంగిల్ లో ప్రజెంట్ చేయబోతున్నాడట.
హొంబలే బ్యానర్ లో మూడో సినిమా రాజ్ కుమార్ పెరియసామితో ఉండబోతోంది. రాజ్ కుమార్ ఇంతకు ముందు అమరన్ తో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఇది అతని రెండో సినిమానే. అలాంటి మూవీతో భారీ విజయం అందుకున్నాడు. మరి అతను ప్రభాస్ తో మూవీకి సిద్ధం అవుతున్నాడా.. లేక ఈలోగా ఒకట్రెండు సినిమాలు చేస్తాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తంగా హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ప్రభాస్ గతంలోనే మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ మూడు సినిమాలేంటీ, దర్శకులెవరు అనేది ఈ న్యూస్ తో క్లారిటీ వచ్చేసింది. మరి ఫ్యూచర్ లో ఈ లిస్ట్ లో ఏదైనా మార్పులు ఉంటాయా లేదా అనేది తెలియదు కానీ.. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 తర్వాత ఈ ముగ్గురు దర్శకులతో సినిమాలకు సిద్ధం అవుతాడు ప్రభాస్.