గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా పెద్ది. బుచ్చిబాబుకు ఇది రెండో సినిమానే అయినా భారీ అంచనాల క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు.పైగా బ్యాక్ ఎండ్ లో సుకుమార్ ఉండటం మరింత కలిసొచ్చింది.దీంతో పాటు సుకుమార్ తో పనిచేసిన హీరోలందరికీ కో డైరెక్టర్ గా బుచ్చిబాబు బాగా తెలుసు. ఆ కారణంగానే ఈ ప్రాజెక్ట్ కు రామ్ చరణ్ తో పాటు హైప్ వచ్చింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు మరో పాత్రలో కనిపించబోతున్నాడు. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న పెద్ది ఓటిటి డీల్ భారీ ధరకు ఫైనల్ అయింది. ఈ ఫిగర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.
పెద్ది ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ తీసుకుంది. అన్ని భాషలకు కలిపి ఈ సంస్థ 105 కోట్లకు డీల్ ఫైనల్ చేసుకుంది. రామ్ చరణ్ కు సంబంధించి ఇప్పటి వరకూ ఇదే హయ్యొస్ట్ ఓటిటి డీల్ కావడం విశేషం. సో.. ఇంకా ప్రొడక్షన్ లో ఉండగానే రికార్డుల వేట మొదలుపెట్టిన పెద్ది రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.