Bahubali 3: 'బాహుబలి3'ని పక్కన పెట్టేశారా?
Bahubali 3: ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ మెయిన్ లీడ్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి..;
Bahubali 3: ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ మెయిన్ లీడ్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి.. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టించింది. అంతేకాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ ని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కించాలని నెట్‌ఫ్లిక్స్ భావించింది.
రూ.150కోట్లు ఖర్చు పెట్టి ఆరు నెలల పాటు షూటింగ్ కూడా చేశారు. ప్రస్తుతం దీనిని పక్కన పెట్టేశారని తెలుస్తోంది. ఫైనల్ అవుట్‌పుట్‌పై సంతృప్తి చెందని నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ మొత్తాన్ని పక్కన పెట్టేసిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీనిపైన మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కొంత భాగాన్ని చిత్రీకరించగా, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు.
ఆ తర్వాత వామికా గబ్బి కీలక పాత్రలో చాలా సన్నివేశాలను రీషూట్ చేశారు. వామికా, రాహుల్ బోస్, అతుల్ కుల్‌కర్ణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.