ఏ సినిమా కూడా ఇది క్లాసిక్ అవుతుందని నిర్మించరు.. రూపొందించరు. క్లాసిక్స్ అనేవి ఆటో మేటిక్ గా ఆడియన్స్ నుంచి డిసైడ్ అవుతాయి. అలా అనిపించుకున్న తమిళ్ మూవీ ‘96’. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ మూవీ 2018లో విడుదలైన ఈ మూవీకి దేశవ్యాప్తంగా అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. టీనేజ్ లవ్ స్టోరీస్ లోని మాధుర్యాన్ని ప్రతి ఒక్కరు మరోసారి ఆస్వాదించారు. ఎప్పుడు చూసినా బోర్ కొట్టనివ్వని కథనం, మ్యూజిక్ తో ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిందీ చిత్రం.
రీసెంట్ గా సత్యం సుందరం అనే సినిమాతో ఆకట్టుకున్న ప్రేమ్ కుమార్ సి డైరెక్ట్ చేసిన మూవీ 96. గోవింద్ వసంత్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. త్రిష సినిమా అంతా కేవలం రెండు డ్రెస్ లతోనే కనిపిస్తుంది. యంగ్ కపుల్ గా యాక్ట్ చేసిన కుర్రాళ్లు కూడా అదరగొట్టారు. ఈ మూవీ తర్వాత గౌరీ కిషన్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లు అయిపోయారు అంటే ఈ మూవీలో వారికి ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఇంక అసలు విషయం ఏంటంటే.. ఇలాంటి క్లాసిక్ కు సెకండ్ పార్ట్ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిందంటున్నారు. సత్యం సుందరం తర్వాత ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసే మూవీ ఇదే అంటున్నారు. బట్ ప్రస్తుతం త్రిష, విజయ్ సేతుపతి చాలా బిజీగా ఉన్నారు. వారి డేట్స్ సెట్ అయితే అప్పుడు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందట. బట్ ఈ మూవీకి సీక్వెల్ అంటే చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని క్లాసిక్స్ ను అలా వదిలేస్తేనే బెటర్ అంటున్నారు. ఇలాంటి మూవీస్ కు వచ్చిన సెకండ్ పార్ట్స్ అన్నీ దాదాపు డిజప్పాయింట్ చేశాయి. అందుకే 96కి పార్ట్ 2 వద్దనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.