స్టార్ హీరోల సినిమాలు అంటే స్టార్ట్ అవడానికి ముందే అనేక వార్తలు వస్తుంటాయి. వీటిలో చాలా వరకూ నిజం అయి ఉండవు. ఎవరి ఊహలకు తోచింది వాళ్లు చెప్పుకువస్తుంటారు. ఇవి మాగ్జిమం రూమర్స్. ఈ గాసిప్స్ ను నిజం అనుకునే వాళ్లు కూడా చాలామందే ఉంటారు. అలా ఇప్పుడు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తోన్న మూవీ గురించి కూడా ఇలాంటి కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆశ్చర్యంగా ఇవి బాలీవుడ్ నుంచి వస్తుండటం విశేషం.
స్పిరిట్ అనే టైటిల్ తో రాబోతోందీ మూవీ అని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అప్పటి నుంచి కూడా ప్రభాస్ ఇందులో పోలీస్ గా నటిస్తాడు అనే ప్రచారమే ఉంది. ఓ రా అండ్ రస్టిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని ఇన్ డైరెక్ట్ గా సందీప్ కూడా చెప్పాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పారు. ఇక ఈ మూవీలో యానిమల్ లో నటించిన తృప్తి దిమ్రిని హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ ప్రభాస్ ను పోలీస్ గానే ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇది కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని బాలీవుడ్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఓ రకంగా హారర్ మూవీ అనుకోవచ్చు.
ఇప్పటికే రాజా సాబ్ తో హారర్ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. వెంటనే మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ అంటే ఒప్పుకుంటాడా.. అనేదే పెద్ద ప్రశ్న. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ కే ఓ ఛాలెంజింగ్ కేస్ వస్తుందని.. ఆ కేస్ ను ఛేదిస్తూ వెళుతున్న కొద్దీ దాని వెనక కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న విషయం తెలుస్తుందని.. ఆ కోణంలోనే ఈ కథ సాగుతుందని.. అందుకే ‘స్పిరిట్’ అనే టైటిల్ పెట్టారు అనేది ఆ వార్తల సారాంశం. ఏదేమైనా ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే వినడానికి ఇదీ బానే ఉందనిపిస్తోంది. మరి ఈ సూపర్ నేచురల్ మేటర్ గురించి సందీప్ ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.