స్టార్ హీరోల సినిమాలు అంటే ఆ హీరోలు ప్రమోషన్స్ తో హడావిడీ చేస్తుంటారు. అభిమానులు హుషారు తెప్పిస్తుంటారు.పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కు రాడు కదా. అందుకే ఆ బాధ్యతను ఒంటి చేత్తో మోస్తోంది హీరోయిన్ నిధి అగర్వాల్. కొన్ని రోజులుగా అన్ని ఈవెంట్స్ కు తనే అటెండ్ అవుతోంది. అన్ని ప్రెస్ మీట్స్ తనే మెయిన్ ఆన్సర్స్ ఇస్తోంది. సినిమాపై అంచనాలు పెంచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇక ఇప్పుడు నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తోంది. నిజానికి తనకు మరో సపోర్ట్ కూడా కనిపించడం లేదు. ఏఎమ్ రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ ఈ తరం తెలుగు ఆడియన్స్ కు పెద్దగా తెలియదు. పైగా వాళ్లు రిలీజ్ హడావిడీలో ఉన్నారు. అందుకే సినిమా బాధ్యతంతా తన భుజాలపై వేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ లతోనూ ఇంటర్వ్యూస్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో సోలో హీరోయిన్ గా కాక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ కూడా ఇంత బాధ్యతగా తమ సినిమాను మోయలేదు అనే చెప్పాలి.
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సోమవారం హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ ఈవెంట్ కు రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు అటెండ్ అవుతారు అనే ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా వస్తాడు. ఆ తర్వాత రిలీజ్ కు మరో రెండు రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. గురువారం రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇక ఆ తర్వాత ఎవరెన్ని చెప్పినా కంటెంట్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. అప్పటి వరకూ నిధి అగర్వాల్ సినిమాను మోస్తూనే ఉంటుందేమో.