Niharika Konidela: ఈ బ్రేక్‌లో నేను నేర్చుకున్న పాఠాలు ఇవే: నిహారికా

Niharika Konidela: నిహారికా ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడెన్‌గా సోషల్ మీడియా నుండి మాయమయిపోయింది.

Update: 2022-05-01 09:30 GMT

Niharika Konidela: చాలామంది ఏ రకమైన ఎమోషన్ వచ్చినా ఈమధ్య సోషల్ మీడియాలో దానిని బయటపెట్టేస్తున్నారు. సంతోషం వస్తే దానిని పోస్ట్ చేయడం, బాధ వస్తే సోషల్ మీడియాకు దూరంగా ఉండడం.. ఇలా ఏదేదో చేసేస్తున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ.. మెగా వారసురాలు నిహారికా కొణిదెల కూడా కొన్నా్ళ్ల పాటు ఇన్‌స్టాకు దూరంగా ఉంది. ఇక ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా నిహారికా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

నిహారికా ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడెన్‌గా సోషల్ మీడియా నుండి మాయమయిపోయింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసేసింది. అంతే కాకుండా ఇంకే ఇతర మాధ్యమం వల్ల కూడా తన అభిమానులకు టచ్‌లో లేదు. తన భర్త చైతన్య పెట్టిన పోస్టుల్లోనే అక్కడక్కడా కనిపించింది నిహారికా. ఇక తాజాగా ఇన్‌స్టా్గ్రామ్‌లో తన రీఎంట్రీ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది నిహారికా.

'ఈ 8 వారాల ఇన్‌స్టా్గ్రామ్ బ్రేక్ వల్ల నేను నేర్చుకున్న 3 పాఠాలు.. 1) ఈ ప్రపంచం ఏమీ అంతమయిపోలేదు. 2) ఇతర ఏం చేస్తున్నారో నేను అస్సలు పట్టించుకోలేదు. 3) ఇప్పుడు పోస్ట్ చేయడానికి నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యాను.' అంటూ తన లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేసింది నిహారికా కొణిదెల. ఇక తాజాగా షార్ట్ హెయిర్‌తో తన లుక్‌ను పూర్తిగా మార్చేసిన నిహారికా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News