Nisha Agarwal : రీఎంట్రీపై నిషా అగర్వాల్ క్లారిటీ..!
Nisha Agarwal : టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నటి నిషా అగర్వాల్..;
Nisha Agarwal : టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నటి నిషా అగర్వాల్.. ఏమైంది ఈవేళ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నిషా.. హీరోయిన్ గా ఉన్నప్పుడే తన బాయ్‌ఫ్రెండ్ కరణ్‌ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. సినిమాలకి దూరమైనప్పటికీ అభిమానులకి సోషల్ మీడియా ద్వారా ముచ్చటిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చింది. అందులో భాగంగానే 'మీకు మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని ఓ నెటిజన్ అడగగా 'మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది నిషా..అయితే నిషా ఎలాంటి పాత్రతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి మరి.