Nivetha Thomas : మలయాళ పరిశ్రమకు ఇది ఒక చేదు అనుభవం : నివేదా థామస్‌

Update: 2024-09-02 07:15 GMT

హీరో రానా సమర్పణలో రూపొందిస్తున్న చిత్రం ‘35- చిన్న కథ కాదు’. నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి నందకిషోర్‌ ఈమాని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మీడియాతో ముచ్చటించింది నివేదా థామస్. ఇందులో భాగంగా మలయాళ ఇండస్ట్రీలో ఇటీవల జరిగిన లైంగిక వేధింపులు, హేమా కమిటీ నివేదికపై నివేతాను ప్రశ్నించగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆమె మాట్లాడుతూ.. 'మలయాళ పరిశ్రమకు ఇది ఒక చేదు అనుభవం, ప్రస్తుతం జరిగే పరిణామాలను నేను నిశితంగా గమనిస్తున్నాను, హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతిచోటా అమలు చేయాలనీ నేను ఆశిస్తున్నాను. ఇది మహిళలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ పని ప్రదేశాల్లో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం చాలా కీలకం. ‘ఇంట్లో కంటే ఎక్కువగా వర్క్ స్పేస్‌లో ఉంటున్నాం, సో సురక్షితమైన వాతావరణం ఉండటం చాలా ముఖ్యం’’ అని నివేదా థామస్ తెలిపారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News