నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తల్లి కొడుకులుగా నటిస్తోన్న చిత్రానికి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ టైటిల్ పెట్టబోతున్నారనే వార్తలు వచ్చాయి. పైగా చూసిన వాళ్లంతా మంచి టైటిల్ అన్నారు. అందుకే ఆ టైటిల్ నే ఫైనల్ చేసి ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా విజయశాంతి, కళ్యాణ్ రామ్ కలిసి ఉన్న ఫోటోను విడుదల చేశారు. ఈ మూవీని ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ చిత్రంలో విజయశాంతి.. వైజయంతి ఐపిఎస్ అనే పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటి వరకూ సౌత్ లో లేడీ పోలీస్ అంటే డౌటే లేకుండా కనిపించే ఫేస్ కర్తవ్యంలో విజయశాంతిదే. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు కూడా వైజయంతి. అందుకే ఈ చిత్రానికి ఆ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు అనుకోవచ్చు. ఇక చాలా రోజుల తర్వాత విజయశాంతి సినిమాలు ఒప్పుకుంటోంది. ఆ మధ్య చేసిన సరిలేరు నీకెవ్వరులో ఆమె పాత్ర అంత గొప్పగా పండలేదు. బట్ ఈ సారి తనకు టైలర్ మేడ్ లాంటి రోల్. అందుకే ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.
కళ్యాణ్ రామ్ సరసన సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, మరో పాత్రలో బాలీవుడ్ నుంచే సొహైల్ ఖాన్ తెలుగు తెరపై కనిపించబోతున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ వేసవిలోనే విడుదల చేయబోతున్నారు.