Rishab Shetty : సితారతో రిషబ్ శెట్టి రెబలిజం

Update: 2025-07-30 07:12 GMT

అందరు తిరుగుబాటు దారులు యుద్ధంలో నకిలీలు కాదు. కొందరిని విధి ఎంచుకుంటుంది. అలాంటి ఓ తిరుగుబాటుదారుడి కథే ఇది అంటూ రాబోతున్నాడు కాంతార హీరో రిషబ్ శెట్టి. అది కూడా తెలుగు సినిమాతో. యస్.. కొన్నాళ్లుగా నాన్ స్టాప్ మూవీస్, నాన్ స్టాప్ సక్సెస్ లతో దూసుకుపోతోన్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మనోడు సినిమా చేయబోతున్నాడు. ఇదే బ్యానర్ లో తమిళ్ నుంచి ధనుష్, మళయాలం నుంచి దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ మూవీస్ చేశారు. ప్రస్తుతం సూర్య కూడా స్ట్రెయిట్ తెలుగు మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు కన్నడ హీరో వంతు అన్నట్టుగా ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది సితార బ్యానర్. ఇది ఓ రెబల్ కథ అంటూ గర్వంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటిస్తున్నాం అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు నిర్మాత నాగవంశీ.

‘ఈ నేల తగలబడితే.. ఓ తిరుగుబాటుదారుడు ఉద్భవిస్తాడు’ క్యాప్షన్ తో పాటు దూసుకు వస్తోన్న మనుషులపై ఎక్కువ పెట్టిన తుపాకులు, ఆ వెనకే మొహానికి రుమాల్ చుట్టుకుని వెనక కత్తులు పట్టుకున్న యోధుడులా రిషబ్ శెట్టి ఫోటోతో ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. చూడగానే ఆకట్టుకునే కంటెంట్ లా ఉంది ఇది ఈ పోస్టర్.

ఈగ, బాహుబలి, బాహుబలి 2 చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి ఆ మధ్య ఆకాశవాణి అనే చిత్రంతో ఆకట్టుకున్న అశ్విన్ గంగరాజు ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. అతను గతంలో ఓ హిస్టారికల్ సినిమా అనౌన్స్ చేశాడు. కానీ అది ఆగిపోయింది. ఇది బెంగాలీ రచయిత బంకించద్ర ఛటర్జీ రాసిన ఆనందమఠ్ అనే నవల ఆధారంగా ప్రకటించారు. ఓ రెబల్ సన్యాసి కథగా ఉంటుందా నవల. మరి ఈ సినిమా కూడా అదే కథతో వస్తోందా లేక మరో కొత్త కథా అనేది తెలియదు. కానీ అప్పుడు ప్రకటించినప్పుడు నిర్మాతలు వేరు. ఇప్పుడు సితార.సో.. సినిమా ఆగదు. అది గ్యారెంటీ. ఏదేమైనా సితార వాళ్లు ఇతర భాషా హీరోలతో బలే కథలు చేస్తున్నారు.. బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. 

 

Tags:    

Similar News