NTR: ప్రశాంత్ నీల్ ఫ్యామిలీతో ఎన్‌టీఆర్.. స్పెషల్ ఏంటంటే..
NTR: ఎన్‌టీఆర్.. తను పనిచేసే దర్శకులతో సన్నిహితంగా ఉంటాడని తెలిసిన విషయమే.;
NTR: 'ఆర్ఆర్ఆర్' హిట్ తర్వాత ఎన్‌టీఆర్, 'కేజీఎఫ్ 2' హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. ప్రస్తుతం వీరిద్దరికీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఆఫర్ చేయడానికి దాదాపు అన్ని సౌత్ ఇండస్ట్రీ వారు రెడీగా ఉన్నారు. కానీ కొన్నాళ్ల వరకు వీరి షెడ్యూల్స్ బిజీగా ఉండనున్నాయి. తాజాగా ప్రశాంత్ నీల్‌ను, తన సతీమణిని ప్రణతితో వెళ్లి కలిశాడు ఎన్‌టీఆర్. అయితే ఈ మీటింగ్‌కు ఓ స్పెషాలిటీ ఉంది.
ఎన్‌టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ కాంబినేషన్‌లో మూవీ ఇప్పటికే ఫైనల్ అయినా.. సెట్స్‌పైకి వెళ్లడానికి మాత్రం చాలా సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే ఎన్‌టీఆర్.. కొరటాల శివతో ఓ సినిమా సైన్ చేశాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా సలార్, కేజీఎఫ్ 3 సినిమాలతో బిజీ అవ్వనున్నాడు. ఇవన్నీ అయిపోయాకే వీరి కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లనుంది.
అయితే ఎన్‌టీఆర్.. తను పనిచేసే దర్శకులతో సన్నిహితంగా ఉంటాడని తెలిసిన విషయమే. అందుకే ప్రశాంత్ నీల్‌ను కూడా తరచుగా కలుస్తూ ఉన్నాడు. కానీ ఇటీవల ప్రశాంత్ నీల్ ఫ్యామిలీని ఎన్‌టీఆర్ ఫ్యామిలీ కలవడానికి మాత్రం ఓ స్పెషాలిటీ ఉంది. మే 5న ఎన్‌టీఆర్, ప్రణతి తమ 11వ వెడ్డింగ్ యానివర్సినీ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ పెళ్లిరోజు కూడా అదే రోజు కావడంతో ఈ రెండు జంటలు కలిసి ఈ ప్రత్యేకరోజును సెలబ్రేట్ చేసుకున్నాయి.