అందుకే 'ఎవరు మీలో కోటీశ్వరులు' టైటిల్ మార్చాం.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్

Evaru Meelo Koteeswarulu: మీలో ఎవరు కోటీశ్వరుడు బుల్లితెరలో రియాలిటీ షోగా మంచి విజయం అందుకుంది.

Update: 2021-08-24 10:09 GMT

Evaru Meelo Koteeswarulu: మీలో ఎవరు కోటీశ్వరుడు బుల్లితెరలో రియాలిటీ షోగా మంచి విజయం అందుకుంది. దాంతో ఈ షో నాలుగు సీజన్లు విజయవంతంగా నడిచాయి.  మెగాస్టార్ చిరంజీవి  కూడా హోస్టింగ్ చేశారు. ఆ తర్వాత ఈ షోలో జెమినీలో ఎవరు మీలో కోటీశ్వరులుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ షోలో హోస్టింగ్ చేయగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి ఎపిసోడ్ లో పాల్గొన్నారు. మొదటి ఎపిసోడ్ లో ఈ ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్- ఎన్టీఆర్ ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు.

ఈ సందర్భంగా.., పవన్ కళ్యాణ్, కాజల్, ఆర్ఆర్ఆర్, జక్కన్న గురించి అనే విషయాలు పంచుకున్నారు. ఇదీలా ఉంచితే ఈ సీజన్‎లో టైటిల్‎ను మార్చారు.‎ మీలో ఎవరు కోటీశ్వరుడు‎ని ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు. టైటిల్ మార్పుపై వీక్షకుల్లో అనేక ప్రశ్నాలు ఉన్నాయి. అయితే షోలో వాటికి జవాబు ఇచ్చారు ఎన్టీఆర్. ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా పాల్గొంటారు. అంతేకాదు ఈ షోను మగవాళ్లే కాకుండా ఆడవాళ్లు చూస్తారు.. అలాంటప్పుడు ఎందుకు ఈ షోకు మీలో ఎవరు కోటీశ్వరుడు అని అని ఎందుకు ఉండాలి. కోటీశ్వరులు అంటే ఇద్దరు(మగవాళ్లు, ఆడవాళ్లు) వస్తారు. అందుకే కోటీశ్వరు'డు' ను కోటీశ్వరు'లు' గా మార్పించానని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.

శ్రీశ్రీ కవితతో అదరగొట్టిన తారక్‌ షో ప్రారంభించారు. షోలో ఎంత మని గెలిస్తే అంత చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేస్తానంటూ రామ్ చరణ్ షో మొదలు పెట్టారు. ఇప్పటివరకు రూ25 లక్షలు గెలుచుకుని ముందుకు సాగుతున్నారు. ఇంతలోనే టైమ్ అయిపోయింది. ఆరంభంలో రాంచరణ్ కు చాలా సులువైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్టీఆర్..చరణ్ ని ఒక్కో ప్రశ్న అడగడం.. చరణ్ సమాధానం ఇచ్చాక కొంత సమయం ఆ ప్రశ్న గురించి సరదాగా మాట్లాడుకోవడం లాంటి అంశాలతో షో ఎంటర్టైనింగ్ గా ఆరంభం అయింది.

రామ్ చరణ్ తన దగ్గర ఉన్న గుర్రాలలో ఒక దాని 'బాద్‌షా' అని చెప్పారు. 'మగధీర'లో నేను రైడ్ చేసిన గుర్రం అదే అని చెప్పారు. మరోవైపు ఓ స్నేహితుడు అతను చనిపోయే ముందు తనకు మరో గుర్రాన్ని ఇచ్చాడు. దానికి కాజల్ అని పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామ్ చరణ్. నాన్నగారు షూటింగ్స్ తో బిజిగా ఉన్నప్పుడు బాబాయే తనని తండ్రిలా చూసుకున్నారు అని రాంచరణ్ తెలిపాడు.

Tags:    

Similar News