మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సూక్ష్మ సంథాగ్రాహి అంటారు. ఏదైనా చూస్తే ఇట్టే పట్టేస్తాడు. అందుకే ఎన్ని భాషల్లో అయినా తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. అది కూడా తెలుగు అంత కమాండింగ్ గా ఉంటుందనేది కూడా అందరికీ తెలుసు.ఆర్ఆర్ఆర్ తో పాటు దేవర చిత్రాలకు ప్యాన్ ఇండియా స్థాయిలో(ఒక్క మళయాలం తప్ప) మిగతా భాషల్లో తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఇంగ్లీష్ యాక్సెంట్ లో మాట్లాడటం చూసి కొందరు ఆశ్చర్యపోయారు. మరికొందరు విమర్శించారు. బట్ ఆ పారిన్ యాక్సెంట్ ను పట్టుకోవడం కూడా అంత సులువేం కాదు కదా..
ఇక ఇప్పుడు దేవర కోసం జపనీస్ ను కూడా అలాగే సర్ ప్రైజ్ చేస్తున్నాడు. నిజానికి అతను జపాన్ లో కూడా అలాగే మాట్లాడతాడా అని చాలామంది అనుకున్నారు. అయితే అనుకున్నంత పనీ చేశాడు. దేవర ఈ నెల 28న జపాన్ లో విడుదల కాబోతోంది. ఆల్రెడీ కొందరికి వేసిన ప్రీమియర్స్ చూసి బ్లాక్ బస్టర్ అంటూ అక్కడి మీడియా రాసేస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం 21,22 తేదీల్లో జపాన్ లో పర్యటించాడు ఎన్టీఆర్. ఆ సందర్భంగా చాలా పదాలు జపనీస్ లోనే మాట్లాడి అక్కడి జనాలకూ షాక్ ఇచ్చాడు. ఏదో ముంబై హీరోయిన్లు అందరూ బాగున్నారా అనే ఒక్క పదం తరహాలో కాకుండా చాలా 'సెంటెన్స్'లు జపనీస్ లో మాట్లాడాడు. పైగా అక్కడి వాళ్లు అడిగిన ప్రశ్నలకు కొన్ని పదాల్లో జపనీస్ లోనే సమాధానం చెప్పాడు. ఏదేమైనా మనోడు కాస్త కాన్ సెంట్రేట్ చేస్తే ఆ భాష నేర్చుకోవడానికి కూడా పెద్ద టైమేం పట్టదేమో. అందుకే అంటారు అతను ఎన్ని పేజీల డైలాగ్ అయినా ఒక్కసారి చూస్తే చెప్పేస్తాడు అంటారు. ఓ రకంగా ఇదో ఆశీర్వాదం అనుకోవాలేమో.