ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నే వదులుకుంటున్నాడు. తన కలల ప్రాజెక్ట్ ఏం కాదు అది. కాకపోతే అంతకు ముందు వచ్చిన మూవీ రిజల్ట్ ను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. విశేషం ఏంటంటే.. ఎన్టీఆర్ మాత్రమే కాదు హీరోయిన్ కియారా అద్వానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది కూడా వదులుకుంది. అంతటికీ కారణం వార్ 2. యస్ వార్ 2 రిజల్ట్స్ వల్ల ఈ నిర్ణయాల తీసుకున్నారు. అయితే ఈ మూవీ వల్ల దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ధూమ్ 4ను వదులుకున్నాడు. అయాన్ వల్ల ఆ నిర్ణయం తీసుకోవడంలో పెద్ద రీజన్ ఏం లేదు. బట్ ఎన్టీఆర్ తో పాటు కియారా కూడా రెండు ప్రాజెక్ట్స్ ను వదులుకున్నాడు.
వార్ 2 రిజల్ట్ వల్ల ఎన్టీఆర్ ఈ స్పై యూనివర్స్ మూవీలో మెయిన్ లీడ్ లో నటించబోతోన్న మూవీని వదులుకున్నాడు. స్పై మూవీస్ వల్ల ఇప్పుడున్న సిట్యుయేషన్స్ కు వర్కవుట్ కావడం లేదు అనేది ఓ కారణం అయితే.. వార్ 2 లో తనను అలా చూపించాల్సిన విషయమే కూడా ఓ కారణంగా అతను భావిస్తున్నాడు. అందుకే యశ్ రాజ్ ఫిల్మ్స్ వారి స్పై యూనివర్స్ లో పార్ట్ అవడం లేదు అని భావించాడు ఎన్టీఆర్. సో.. అతను సోలోగా నటించబోతోన్న ప్రాజెక్ట్ ను కూడా వదులుకున్నాడు అని భావించాల్సి ఉంటుందన్నమాట.
యశ్ రాజ్ ఫిల్మ్స్ కాంట్రాక్ట్ లో భాగంగా కూడా కియారా అద్వానీ ప్రాజెక్ట్ ను కూడా వదులుకోవాల్సి ఉంటోంది. ఈ మూవీలో తను కూడా భాగం కావాలని భావించడం లేదు. అంచేత మూవీ వదులుకుంటోంది. సో.. ఎన్టీఆర్ తో పాటు కియారా ప్రాజెక్ట్స్ కూడా వేర్వేరుగానే ఉండబోతున్నాయి. మొత్తంగా అయాన్ ముఖర్జీ వల్ల ధూమ్ 4 కూడా పోయినట్టే అని అనుకుంటున్నారు.