సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న మూవీ ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయబోతున్నారు. విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ స్పై గా నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ 'వి.డి 12' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ టైటిల్ ను ఈ నెల 12న అనౌన్స్ చేయబోతున్నారు. టైటిల్ తో పాటు టీజర్ కూడా ఉంటుంది. అయితే టీజర్ లో డైలాగ్స్ ఏం ఉండవట. కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఉంటుందట. ఆ వాయిస్ ను తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెబుతాడు అనే ప్రచారం రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. అయితే అది నిజమా కాదా అనే క్లారిటీ మాత్రం చాలామందిలో లేదు.
అయితే విజయ్ దేవరకొండ మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అనేది నిజమే అంటూ ఇన్ డైరెక్ట్ గా డిక్లేర్ చేశాడు నిర్మాత నాగవంశీ. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పులి బొమ్మను పోస్ట్ చేశాడు. అంటే యంగ్ టైగర్ అనే కదా అర్థం అంటున్నారు చాలామంది. నిజానికి ఈ వాయిస్ ఓవర్ చాలా అగ్రెసివ్ గా ఉంటుందట. ఆ అగ్రెషన్ కు ఎన్టీవోడి వాయిస్ తోడైతే అరుపులే అనుకోవచ్చు.
అన్నట్టు ఇదే వాయిస్ ను తమిళ్ లో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ చెప్పబోతున్నాడట. సో.. ఈ సారి విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపడం ఖాయం అనుకోవచ్చేమో.