యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర పార్ట్ 1 ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి రానుంది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న సినిమా కావడంతో ముంబై, చెన్నై, కేరళ, కర్ణాటక వంటి ప్రాంతాలకు తిరుగుతూ వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్టు గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట తారక్. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబందించిన చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే అధికారిక ప్రకటనను రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అట్లీ గత సినిమాల్లాగే ఎన్టీఆర్ సినిమాలో కూడా స్ట్రాంగ్ సోషల్ ఎలిమెంట్ తో పాటు యాక్షన్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయట. వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.