మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దూకుడుగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలో చేసిన దేవర మరీ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బట్ కమర్షియల్ గా మాత్రం పాస్ అయిపోయింది. బట్ ఈ సారి అలాంటి మిస్టేక్స్ లేకుండా చూస్తున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ మాగ్జిమం షూటింగ్ కూడా అయిపోయింది. చివరి ఒకటీ రెండు షెడ్యూల్స్ మాత్రం ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం ఈ మూవీ టీమ్ జోర్డాన్ లో చిత్రీకరణ సాగించబోతోంది. జోర్డాన్ లో ఓ రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరించబోతున్నారు. ఈ మేరకు టీమ్ ఇప్పటికే జోర్డాన్ చేరిపోయింది.
ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటుగా టోవినో థామస్ మధ్య చిత్రీకరించబోతున్నారట. మరి టోవినో థామస్ కంప్లీట్ గా విలన్ గా నటించబోతున్నాడా లేక ఇంకేదైనా సీక్వెన్స్ లో ఉండబోతున్నాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. బట్ ఈ రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం సినిమాలోనే అత్యంత కీలకంగా ఉండబోతున్నాయి అనేది తెలుస్తోంది. అందుకే ఈ సీన్స్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పెషల్ ఫోకస్ చేశాడట.
ఇక ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోందీ మూవీలో. టోవినో థామస్ తో పాటు అనిల్ కపూర్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. మొదటి స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక పార్ట్ గానే భావించారు. బట్ తర్వాత మనసు మార్చుకున్నారు. ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా చిత్రీకరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ సలార్ 2 తర్వాత చేశాకే ఈ మూవీ సెకండ్ పార్ట్ ఉండబోతుందట.