Ram Charan : రామ్ చరణ్ తో ఎన్టీఆర్ ఫేవరెట్ డైరెక్టర్

Update: 2025-04-09 08:03 GMT

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వారికీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఉంటారు. ఆ దర్శకులతో పని చేయాలని కోరుకుంటారు. ఇలాంటి లిస్ట్ లో ఉన్న ఓ దర్శకుడు ఎన్టీఆర్ తో కాక, రామ్ చరణ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఆ దర్శకుడెవరో గెస్ చేశారు కదా..? యస్.. వెట్రిమారన్. ఈ తమిళ్ డైరెక్టర్ అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. అతనితో సినిమా చేయాలనుందని ఓపెన్ గానే చెప్పాడు. ఈ విషయం వెట్రిమారన్ కూ తెలుసు. అయితే వెట్రి కథలు వేరు. ఎంత పెద్ద హీరో అయినా అతని కథల్లో ఉండిపోవాల్సిందే. ఇమేజ్ లకోసం కథల్లో మార్పులు చేయడు అతను. అందుకే వెట్రిమారన్ చిత్రాలకు నేషనల్ అవార్డ్స్ కూడా వస్తుంటాయి.

పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో ఎంటైర్ కంట్రీని మెస్మరైజ్ చేసిన రామ్ చరణ్ పెద్ది తర్వాత సుకుమార్ తో ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ అఫీషియల్ గానే అనౌన్స్ అయింది. అయితే ఈ రెండు సినిమాలతో పాటు కొత్త కథలు కూడా వింటున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలో వెట్రిమారన్ అతనికి ఓ కథ చెప్పాడట. అలాగే కిల్ మూవీ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ కూడా అతనికి ఓ లైన్ చెప్పాడట. కిల్ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా చేస్తాడు అనే వార్తలు కొన్నాళ్లుగా వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా నిఖిల్ ఓ కథ లైన్ వినిపించాడు. వీరితో పాటు ఇంకా కొత్త కథలు చెప్పేవాళ్లు ఉంటే వినడానికి సిద్ధంగా ఉన్నాడట రామ్ చరణ్. యూనివర్సల్ అప్పీల్ తో ప్యాన్ ఇండియా ఆడియన్స్ కూ కనెక్ట్ అయ్యేలాంటి కథలకోసం చూస్తున్నాడని టాక్.

ఇక వెట్రిమారన్, నిఖిల్ నగేష్ భట్ కథలు విన్నాడు కానీ.. ఇంకా ఏ నిర్ణయమూ చెప్పలేదట. అంటే ఆ కథలు నచ్చలేదా లేక ఇంకేవైనా మార్పులు చెప్పాడా అనేది చూడాలి.

Tags:    

Similar News