Odela 2 - Teaser : ఓదెల 2 టీజర్ ఎలా ఉంది..?

Update: 2025-02-22 05:45 GMT

తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది రూపొందిస్తోన్న సినిమా ఓదెల 2. ఇవాళ మహా కుంభమేళాలో ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ముందు నుంచీ ఓదెల 2 పై చాలామందిలో ఓ ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని అంచనాలు పెంచేలా ఉంది ఈ టీజర్. తమన్నా అఘోరాగా నటిస్తుండటంపై చాలామంది ఆశ్చర్యపోయారు.ఇప్పటికే అఖండతో బాలయ్య అఘోరాగా అదరగొట్టడంతో తమన్నా ఎలా చేస్తుందా అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. అదే టైమ్ లో ఫస్ట్ పార్ట్ కు కొనసాగింపుగా ఉంటుందా లేక కొత్త కథగా ఉంటుందా అనే సందేహాలూ ఉన్నాయి. అన్నిటికీ సమాధానం చెప్పేలానే ఉంది టీజర్.

ఆరంభంలోనే మనిషి లేకుండా సైకిల్ లైట్ వెలగడం, బెల్ మోగడం.. ఆ సైకిల్ పై ఎవరో వెళుతున్నట్టుగా ఉండటం కనిపిస్తుంది.మధ్యలో తమన్నా లుక్స్, ఆమెలోని ఫైర్ ను ఎలివేట్ చేసే సీన్స్ కనిపిస్తున్నాయి.ఫస్ట్ పార్ట్ లో ఉన్న వశిష్టను చంపేసి పాతిపెట్టే సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. దెయ్యం వచ్చిందంటే దైవమూ వస్తుంది అనే మాటతో పాటు నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం అన్నీ నా రూపానికి దాసోహమే అంటూ నెగెటివ్ రోల్ ప్లే చేసే వ్యక్తి చెప్పిన డైలాగ్ చూస్తే.. పంచభూతాలను ఆధీనంలోకి తీసుకోవాలనుకున్న ఒక మాంత్రికుడిని అంతం చేసేందుకు అఘోరాగా తమన్నా ఎంట్రీ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

టీజర్ లోప్రతి ఫ్రేమ్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ప్రతి పాత్రను వైవిధ్యంగా ప్రెజెంట్ చేశారు. దీనికి తోడు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ మెయిన్ హైలెట్ కాబోతోందని అర్థం అవుతోంది. ఓ రకంగా ఓదెల 2 టీజర్ తో అంచనాలు భారీగా పెరుగుతాయి. బిజినెస్ కూడా అదే రేంజ్ లో అవుతుందని చెప్పొచ్చు.

ఇక టెక్నికల్ గా దర్శకుడు స్థానంలో అశోక్ తేజ అని వేశారు కానీ.. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వ పర్యవేక్షణ అంటూ సంపత్ నంది తన పేరే వేసుకున్నాడు. మొత్తంగా మహా కుంభమేళాలో రిలీజ్ చేసిన ఈ టీజర్ చాలా ఇంప్రెసివ్ గానే ఉందని చెప్పాలి.

Tags:    

Similar News