Officer On Duty : నెట్ ఫ్లిక్స్ ను షేక్ చేస్తున్న ఆఫీసర్

Update: 2025-03-26 09:46 GMT

థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఆ స్థాయిలో విజయం సాధించవు అనే సెంటిమెంట్ ఉంది. అలాగే థియేటర్స్ లో పోయిన సినిమాలు ఓటిటిలో హిట్ అవుతుంటాయి. ఈ రెండు సందర్భాలూ కలవడం అరుదు. అలాంటి అరుదైన సందర్భంలోనే నిలిచింది ఆఫీసర్ ఆన్ డ్యూటీ. మళయాలంలో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయింది. 15 కోట్ల బడ్జెట్ తో రూపొందితే 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఈ యేడాది ఇప్పటి వరకూ వచ్చిన మూవీస్ లో మాలీవుడ్ నుంచి టాప్ ప్లేస్ లో ఉంది. ఫిబ్రవరి 20న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న తెలుగులో విడుదల చేశారు. కానీ మార్చి 20 నుంచి ఓటిటి స్ట్రీమింగ్ డేట్ కూడా రావడంతో తెలుగులో థియేటర్స్ లో ఎవరూ పట్టించుకోలేదు కానీ.. లేదంటే ఇక్కడా బాక్సాఫీస్ ను గెలిచేదే.

ఇక ఈ నెల 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోన్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఇప్పుడు టాప ప్లేస్ లో ఉండటం విశేషం. ఈ నెల 17 - 23 వరకూ స్ట్రీమ్ టైమ్ చూస్తే టాప్ ప్లేస్ లో ఆఫీసర్ ఆన్ డ్యూటీ నిలిచింది. కుంచకో బోబన్, జగదీష్, ప్రియమణి, వైశాఖ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జీతూ అష్రఫ్ డైరెక్ట్ చేశాడు. ఓ సాధారణ పాయింట్ తో మొదలై అసాధారణ స్క్రీన్ ప్లే తో ఎండ్ అయిన ఈ సినిమా చూసిన వాళ్లంతా మైండ్ బ్లోయింగ్ అనేస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ లో కూడా టాప్ లేపుతోంది.

విశేషం ఏంటంటే ఆ డేట్స్ లో టాప్ టెన్ లో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ టాప్ టెన్ లిస్ట్ చూస్తే..

1. ఆఫీసర్ ఆన్ డ్యూటీ

2. డ్రాగన్

3. ఎమర్జెన్సీ

4. ఆజాద్ (హిందీ)

5. తండేల్

6. నాదానియన్(హిందీ)

7. ద ఎలక్ట్రిక్ స్టేట్ (ఇంగ్లీష్ )

8. విడాముయర్చి

9. పుష్ప 2

10. ధూమ్ ధామ్ (హిందీ)

ఇదీ లిస్ట్. టాప్ టెన్ లో ఇప్పటికీ పుష్ప2 ఉండటం విశేషం అయితే.. తండేల్ సైతం ఆకట్టుకోవడం ఆ మూవీ విజయానికి మరో సంకేతం.

Tags:    

Similar News