పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్ స్టామ్ లా రెచ్చిపోయిన మూవీ ఓ.జి. వరల్డ్ వైడ్ గా ఓ.జికి తిరుగులేని క్రేజ్ వచ్చింది. అందుకే ప్రీమియర్ షోస్ కూ ఓ రేంజ్ లో స్పందన వచ్చింది. మొదటి రోజు కంటే ప్రపంచ వ్యాప్తంగా ఓ.జిని ప్రీమియర్ షోస్ లో చూసిన వారే ఎక్కువగా ఉండటం విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చింది అనే చెప్పాలి. చిన్ని చిన్న లోపాలు ఉన్నా.. సుజీత్ డైరెక్షన్ స్కిల్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్ లో నిలిపాయి అనే చెప్పాలి. కొన్నాళ్లుగా పవన్ మూవీస్ కు సాలిడ్ ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. ఈ టైమ్ వచ్చిన ఓ.జి ఆ లోటును తీర్చింది.
ఓ.జికి ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు 90 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. పవన్ కెరీర్ లో ఇదే హయ్యొస్ట్ ఓపెనింగ్.గతంలో పవన్ కు కర్ణాటకలో మంచి మార్కెట్ ఉండేది. ఈ సారి అది ఓపెనింగ్స్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు. కన్నడ కంటే తమిళ్ మార్కెట్ కాస్త బెటర్ అనిపించుకుంది.అయితే తెలుగు వరకూ ప్రస్తుతం దసరా హాలిడేస్ కాబట్టి వసూళ్లు మరింతగా పెరుగుతాయి. ఈ ఊపు ఇలాగే కొనసాగితే ఓ.జి పవన్ కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలుస్తుంది. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ఇమ్రన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, తేజ్ సప్రూ, సుదేవ్ నాయర్, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.