Rajinikanth : నా అల్లుడు చాలా మంచోడు... వైరల్‌గా మారిన రజినీ పాత వీడియో..!
Rajinikanth : కోలీవుడ్ కపుల్స్ ధనుష్, ఐశ్వర్యల బ్రేకప్ అందర్నీ షాక్‌కు గురిచేసింది. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి తాజాగా ఎండ్‌కార్డు వేశారు వీరిద్దరూ.
Rajinikanth : కోలీవుడ్ కపుల్స్ ధనుష్, ఐశ్వర్యల బ్రేకప్ అందర్నీ షాక్‌కు గురిచేసింది. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి తాజాగా ఎండ్‌కార్డు వేశారు వీరిద్దరూ. విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా స్వయంగా ధనుష్, ఐశ్వర్య వేర్వేరుగా వెల్లడించారు. ఈ క్రమంలో ధనుష్-ఐశ్వర్యలకు సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అందులో భాగంగానే కాలా మూవీ ఆడియో ఫంక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో ధనుష్ గురించి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రజినీకాంత్ మాట్లాడుతూ.. "ధనుష్ చాలా మంచి వ్యక్తి. తల్లిదండ్రులను దేవుళ్లుగా భావిస్తాడు. భార్యను బాగా చూసుకుంటాడు. అతను మంచి తండ్రి, మంచి అల్లుడు, మంచి మనిషి, చాలా ప్రతిభ కలవాడు" అంటూ రజినీ చెప్పుకొచ్చారు.
అయితే ధనుష్, ఐశ్వర్య విడాకుల తర్వాత రజినీ స్పందించకపోవడం గమనార్హం. కాగా రజినీ కాలా సినిమాకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ధనుష్, ఐశ్వర్య 2004లో ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.