Pushpa 2 stampede : పుష్ప 2 తొక్కిసలాటకు యేడాది

Update: 2025-12-04 08:10 GMT

పుష్ప 2.. 2024 డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేయబోతున్నారు. అందుకోసం హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో భారీ సందడి మొదలైంది. అదే టైమ్ లో థియేటర్ లో సినిమా చూడ్డానికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. కట్ చేస్తే జనం తొక్కిసలాట. అందులో ఒక కుటుంబం పడిపోయింది. అందులో భాగంగా ఒక మహిళ అందరికింద పడిపోయింది. ఆమెతో పాటు ఓ బాబు కూడా ఉన్నాడు. కట్ చేస్తే ఆ మహిళ మరణించింది.. బాబుకు హాస్పిటల్ పాలయ్యాడు. ఈ మొత్తం వ్యవహారం ఆ రోజు రెండు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం అయింది. అల్లు అర్జున్ జైలు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఆ టైమ్ లో కొందరు మహిళ మరణానికి కొంత మొత్తం చెల్లించారు. తర్వాత ఆ హాస్పిటల్ పాలైన బాబు కోసం అల్లు అర్జున్ కుటుంబం ఆదుకోవడం కోసం ముందుకు వచ్చింది. కానీ నేటి వరకు ఈ బాబు పరిస్థితి ఎలా ఉంది అనేది మాత్రం కొన్నాళ్ల తర్వాత జనం మర్చిపోయారు. మరి ఇన్నాళ్ల తర్వాత ఇదే రోజున ఆ బాబు పరిస్థితి ఏంటీ.. ఏం జరుగుతోంది అనేది మాత్రం నిర్మాత బన్నీ వాస్ ను కొందరు జర్నలిస్ట్ లు అడగడంపై అతను స్పందించాడు.

అయితే ఈ విషయంపై బన్నీ వాస్ రియాక్ట్ అయ్యాడు. ఆ బాబు కోసం కొంతమంది చేయూతనిచ్చిందుకు ముందుకు వచ్చారు. మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు. దిల్ రాజు లాంటి వాళ్లు ఉంది. ఆ బాబు బాగు కోసం, హాస్పిటల్ ఖర్చుల కోసం చూడటం కోసం, ఆ కుటుంబానికి ఇచ్చేందుకు కొంత మనీ ఇచ్చేందుకు కొన్ని గైడ్ లైన్స్ పాటిస్తున్నాం. అందుకోసం ఆ కుటంబం కోసం శాటిస్ ఫై చేయడానికి పర్టిక్యులర్ గైడ్ లైన్స్ పట్టించుకోవాల్సి ఉంది. అయినా ఇది వేరే వేదిక కాబట్టి దీని గురించి ఏం మాట్లాడదలచుకోలేదు అన్నారు.

మొత్తంగా బన్నీ వాస్ ఆ కుటుంబం కోసం బాగు కోసం మాట్లాడుతున్నట్టుగా తెలియజేశారు. ఘటన మాత్రం దురదృష్టకరం.. ఇందులో రాజకీయాలు వచ్చాయి, అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డాడు.. ఇలాంటివేవి ఉన్నా.. కనీసం ఆ బాబు అయినా బావుండాలని మాత్రం కోరుకోవడం మాత్రం జరుగుతోంది. 

Full View

Tags:    

Similar News