Oscar : ఆస్కార్ ప్రదానోత్సవంలో దీపికా పదుకునే
మార్చి 13న లాస్ ఏంజిల్స్‌లోని సుప్రసిద్ధ డాలీ థియేటర్‌లో ఆస్కార్ అకాడమీ ప్రదానోత్సవాలు జరగనున్నాయి;
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకు ఆరుదైన గౌరవం దక్కింది. 95 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాలలో ప్రెజెంటర్‌గా పాల్గొనేందుకు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. 95వ ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవాలలో ప్రజెంటర్‌గా పాల్గొననున్నట్లు దీపికా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
మార్చి 13న లాస్ ఏంజిల్స్‌లోని సుప్రసిద్ధ డాలీ థియేటర్‌లో ఆస్కార్ అకాడమీ ప్రదానోత్సవాలు జరగనున్నాయి. ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డుల ప్రదానోత్సవానికి ఎంతో యాంగ్జయిటీతో ఎదురు చూస్తున్నట్లు పోస్ట్‌లో తెలిపారు. దీంతో దీపికా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ బాలీవుడ్ నటికి అంతర్జాతీయ అవార్డుల వేడుకలో గౌరవం దక్కడం హర్షించదగ్గ విషయమని కామెంట్లు పెడుతున్నారు.