Brahma Anandam : పెయిడ్ ప్రీమియర్స్.. బ్రహ్మ ఆనందం కాన్ఫిడెన్స్

Update: 2025-02-13 05:45 GMT

బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బ్రహ్మ ఆనందం'. ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించాడు. ప్రభాస్ ట్రైలర్ విడుదల చేయడం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి అటెండ్ కావడంతో పాటు ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం వంటివన్నీ సినిమాపై పాజిటివ్ వైబ్స్ తెచ్చాయి. బ్రహ్మానందం తనయుడు హీరోగా నిలబడేందుకు దాదాపు దశాబ్ధంన్నరకు పైగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. ఓ రకంగా ఇది చివరి ప్రయత్నం అనుకోవచ్చు. ఆ ప్రయత్నంలో తనూ భాగస్వామి అయ్యాడు బ్రహ్మీ. ఈ చిత్రాన్ని ఈ 14న విడుదల చేస్తున్నారు.

తాత మనవళ్ల మధ్య సాగే ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సినిమా ఆద్యంతం వినోదం ఉంటుందని.. ఆఖర్లో ఎమోషన్ తో పాటు ఓ సందేశం కూడా ఉంటుందని ప్రమోషన్స్ లో చెబుతున్నాడు బ్రహ్మానందం. ఇక నిర్మాత ఇప్పటి వరకూ మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి డిఫరెంట్ మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టి ఉన్నాడు. ఇది అతని డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడుతుందనే నమ్మకంతో ఉన్నాడు. దీంతో పాటు సినిమాపై వీరికి విపరీతమైన నమ్మకం కూడా ఉన్నట్టుంది.అందుకే పెయిడ్ ప్రీమియర్స్ కు వెళుతున్నారు. ఈ రోజు(గురువారం) హైదరాబాద్ లో ఏఎమ్.బి, ఏ.ఏ.ఏ థియేటర్స్ లో పెయిడ్ ప్రీమియర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియర్స్ కు గట్టి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రెండు షోస్ ఫుల్ అయిపోయాయి.దీన్ని బట్టి బ్రహ్మ ఆనందంపై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి.  

Tags:    

Similar News