Pailam Pilaga : ఓటీటీలో పైలం పిలగా

Update: 2024-10-08 08:30 GMT

సాయి తేజ, పావని కరణం హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం పైలం పిలగా.. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేట్రికల్ గా రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా పెద్దగా ఆడలేదు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. కోతులగుట్ట గ్రామానికి చెందిన శివ (సాయి తేజ) డిగ్రీ చదివి ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాలీగా ఉంటాడు. ఊర్లో ఏ పని చేసినా గుర్తుంపు ఉండదని, దుబాయికి వెళ్లి బాగా సెటిల్ అవ్వాలనుకుంటాడు. పాస్పోర్ట్, ఉద్యోగం కోసం రూ. 2 లక్షలు కావాల్సి వస్తుంది. దాని కోసం శివ తన నానమ్మ పేరుపై ఉన్న స్థలాన్ని అమ్మాలనుకుంటాడు. తన స్నేహితుడు శ్రీను (ప్రణవ్ సోను)తో కలిసి స్థలం అమ్మేందుకు వెళ్తాడు. అయితే ఆ స్థలం లిటికేషన్లో ఉంటుంది. పంచాయితీ తర్వాత గుట్టగా మారిన రెండెకరాల స్థలం అతనికి వస్తుంది. అది అమ్మకానికి పెడితే ఎవరూ కొనేందుకు ముందుకు రారు. కానీ మరుసటి రోజు 10 లక్షలు ఇస్తానని ఒకరు.. 30 లక్షలు ఇస్తానని మరొకరు.. రూ. కోటి ఇస్తా ఆ స్థలం నాకే అమ్ము అని ఇంకొకరు శివ దగ్గరకు వచ్చి బ్రతిమి లాడుతుంటారు. పనికి రాని ఆ గుట్టను కొనేందుకు వాళ్లంతా ఎందుకు ఆసక్తి చూపారు? అన్నదే కథ. ఈ సినిమాను ఈ టీవీ విన్ ఈ నెల 10 నుంచి స్త్రీమింగ్ చేయనుంది.

Tags:    

Similar News