Parampara Season 2 : 25 కోట్ల వ్యూస్‌తో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో పరంపర సీజన్ 2 రికార్డ్..
Parampara Season 2 : డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ‘పరంపర వెబ్సిరీస్’ సీజన్ 2 రికార్డుల మోత మోగిస్తోంది.;
Parampara Season 2 : డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 'పరంపర వెబ్సిరీస్' సీజన్ 2 రికార్డుల మోత మోగిస్తోంది. ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటి వరకు 250 మిలియన్ మినట్స్ వ్యూస్‌ను కైవసం చేసుకొంది. పరంపర సీజన్ వన్ సక్సస్ అయి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు కొత్త ప్రేక్షకులు కూడా పరంపర సీజన్ 2ను ఎగబడి చూడ్డంతో ఒకేసారి పీక్ వ్యూస్‌ను రీచ్ అయింది.
జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర.. ఈ ముగ్గురి మాస్ పర్ఫామెన్సే ఈ సిరీస్‌కు ఓ ప్లస్ అని చెప్పుకోవచ్చు. మూడు జనరేషన్స్‌కు సంబంధించిన కథ ఈ పరంపర వెబ్ సిరీస్. పొలిటికల్ రివెంజ్, యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఎల్ కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ దీనికి దర్శకత్వం వహించగా శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.