Pawankalyan: పవన్ ఆశయం నెరవేరాలి: పరుచూరి ఆకాంక్ష

Pawankalyan: సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వస్తారు. పదవులు ఆశించి కొందరు, ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో మరికొందరు ఉంటారు.

Update: 2022-09-07 08:49 GMT

Pawankalyan: సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వస్తారు. పదవులు ఆశించి కొందరు, ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో మరికొందరు ఉంటారు. పార్లమెంట్ లేదా అసెంబ్లీలో సీటు సంపాదించి మంత్రిగా కొనసాగాలనే కోరిక పవన్‌లో లేదు. ఒక ఆశయంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఆలోచన గొప్పది.

తన వెంట ఎవరు వచ్చినా రాకపోయినా తన పోరాటం తాను చేస్తున్నారు. తన వాయిస్ చట్ట సభల ద్వారా వినిపించాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని అని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) ని పురస్కరించుకుని పరుచూరి ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు.


వచ్చే ఎన్నికల్లో పవన్ గెలుపొందాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అన్నగారు (ఎన్టీఆర్) మాదిరిగా పవన్‌కు కూడా బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నారు. ఎన్నికల్లో నిలబడగానే గెలుస్తాం, ముఖ్యమంత్రులం అయిపోతాం అనే విషయాన్ని పక్కన పెడితే, సమాజాన్ని బాగు చేయడానికి తన వంతు కృషి చేయాలని అనే ఆలోచన గొప్పది. ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే హక్కుని వచ్చే ఎన్నికల్లో ఆయన పొందాలని ఆశిస్తున్నా అని పరుచూరి వివరించారు. 

Tags:    

Similar News