Akira Nandan : తొలిసారి రక్తదానం చేసిన పవన్ కొడుకు అకీరా

Akira Nandan : పవన్ కళ్యాణ్ పెద్దకొడుకు అకీరా నందన్ తొలిసారి రక్తదానం చేశాడు.. ఈ విషయాన్ని అకీరా తల్లి, నటి రేణుదేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

Update: 2022-04-23 01:30 GMT

Akira Nandan : పవన్ కళ్యాణ్ పెద్దకొడుకు అకీరా నందన్ తొలిసారి రక్తదానం చేశాడు.. ఈ విషయాన్ని అకీరా తల్లి, నటి రేణుదేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. 18 ఏళ్ళు నిండిన తర్వాత అకీరా చేసిన మొదటి రక్తదానం... అవసరంలో ఉన్న వారికి మనం ఇచ్చే అత్యంత విలువైన వస్తువు రక్తదానం. దయచేసి మీకు 18 ఏళ్ళు నిండిన తర్వాత రక్తదానం చేయండి.. మీరు ఎవరి ప్రాణాలను కాపాడగాలరో ఎవరికీ తెలియదు" అంటూ రేణుదేశాయ్ పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అకీరాని అందరు అభినందిస్తున్నారు.. రక్తదానం చేసి యూత్‌కు ఇన్‌స్పైర్‌గా నిలిచావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో చర్చ జరుగుతూనే ఉంది. కానీ రేణుదేశాయ్ ఆ వార్తలను ఖండిస్తూ వస్తున్నారు. 

Tags:    

Similar News