Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బ్యాక్ టు మూవీస్

Update: 2024-09-20 10:08 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో పవర్ లోకి వచ్చిన సినిమాలకు గ్యాప్ వచ్చింది. నిజానికి ఎలక్షన్ కు చాలా రోజుల ముందు నుంచే ఆయన షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చాడు. ప్రజా క్షేత్రంలో నిత్యం కనిపిస్తూ.. అనేక సమస్యలపై సమగ్రమైన అవగాహనతో ముందుకు వెళుతున్నారు. పొలిటీషియన్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటున్నాడు.. కానీ ఆయన్ని ఈ పొజిషన్ లో నిలబెట్టిన సినిమాల్లో మాత్రం ఆ లోటు కనిపిస్తోంది. పవన్ కమిట్ అయి కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న సినిమాలే మూడు ఉన్నాయి. వీటిలో అందరికంటే ముందు ‘ఓ.జి’కి టైమ్ ఇస్తాడు అనుకున్నారు. బట్ అనూహ్యంగా అసలు ఉండదేమో అనుకున్న ‘హరిహర వీరమల్లు’కు డేట్స్ ఇచ్చాడు. ఇవ్వడమే కాదు.. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నాడు. వందలమంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్స్ షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ కొత్త షెడ్యూల్ ఈ నెల 23 నుంచి స్టార్ట్ కాబోతోంది. పవన్ తో ఖుషీ, బంగారం వంటి సినిమాలు చేసిన ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు. ఈ గ్యాప్ వల్ల క్రిష్ తప్పుకున్నాడు. అయితే రత్నం తనయుడు జ్యోతికృష్ణ కూడా దర్శకుడే. తెలుగులోనూ గోపీచంద్ తో ఆక్సీజన్ అనే మూవీ చేశాడు. ఇప్పుడు అతను ఈ ప్రాజెక్ట్ ను టేకోవర్ చేశాడు.

జ్యోతికృష్ణ దర్శకత్వంలోనే మిగతా భాగం చిత్రీకరించబోతున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాజులు, బందిపోటు తరహా కంటెంట్ తో రూపొందుతోన్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహీ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కీరవాణి సంగీతం చేస్తున్నాడు. మరి ఈ షెడ్యూల్ తో పవన్ పోర్షన్ పూర్తి కాదు. కాకపోతే ఇదో బిగ్ సీక్వెన్స్. ఆ తర్వాత మరికొన్ని రోజులు కేటాయిస్తే హరిహర వీరమల్లును రెడీ చేస్తారు.

Tags:    

Similar News