Pawan Kalyan : హరిహర వీరమల్లు.. ఓ పనైపోయింది

Update: 2025-05-06 07:45 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న మూవీ హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని ఇప్పటికే అనేకసార్లు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన హరిహర వీరమల్లు మూవీ కోసం పవన్ కళ్యాణ్ పై చిత్రీకరించాల్సిన కొన్ని సన్నివేశాల కోసమే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఆ డేట్స్ ఇచ్చి ఉంటే మార్చి 27నే విడుదలయ్యేది. తర్వాత అడ్జెస్ట్ చేసినా ఏప్రిల్ 10న విడుదలయ్యేది. ఆ రెండు డేట్స్ మిస్ అయ్యాయి. ఫైనల్ గా పవన్ డేట్స్ ఇచ్చాడు. తాజాగా ఓ రెండు రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. ఈ షూటింగ్ టైమ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సెట్స్ లోనే ఉన్నాడట.

ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇతర పాత్రల్లో బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీ, అనసూయ, అనుపమ్ ఖేర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకూ చిత్రీకరణ జరుపుకున్న పార్ట్ వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ కొత్త పార్ట్ ను కూడా పూర్తి చేసుకుని ఈ నెల 30న విడుదల చేస్తారు అనుకుంటున్నారు. కాకపోతే ప్రమోషన్స్ కు టైమ్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి.

మొత్తంగా ఓ పనైపోయింది. పవన్ పార్ట్ తో సినిమా పూర్తయింది. ఇక రిలీజ్ డేట్ అనేది నిర్మాత చేతుల్లో ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్ అనేవి ఆయా నటీ నటుల డేట్స్ ను బట్టి ఉంటుంది. అంచేత ఈ నెల 30న రిలీజ్ చేయడం దాదాపు కష్టమే అనుకోవచ్చు.

ఇక ఇదే ఊపులో ఓ.జికి కూడా డేట్స్ ఇచ్చేస్తే మరో పనైపోతుంది. నిజానికి ఫ్యాన్స్ హరిహర కంటే కూడా ఓ.జి కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. సో.. పవన్ ఆ సినిమాపైనా ఓ లుక్కేస్తే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ను చూసుకుని ఫ్యాన్స్ మరింత ఖుష్ అవుతారు.

Tags:    

Similar News