Pawan Kalyan: నిన్న గబ్బర్ సింగ్.. నేడు భగత్ సింగ్.. క్రేజీ కాంబినేషన్ ఈజ్ బ్యాక్
పవర్ స్టార్ పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. వరుస సినిమాలతో వారానికి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ అభిమానులకు కిక్కెస్తున్నాడు పవన్.;
పవర్ స్టార్ పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. వరుస సినిమాలతో వారానికి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ అభిమానులకు కిక్కెస్తున్నాడు పవన్. తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఫస్ట్‌లుక్‌ని గురువారం షేర్ చేసింది చిత్ర యూనిట్. ట్విట్టర్ వేదికగా పోస్టర్‌తో పాటు టైటిల్‌ని రివీల్ చేస్తూ ట్వీట్ చేశారు. 'భవదీయుడు భగత్‌సింగ్' అనే టైటిల్‌ని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సామాజిక కోణంలో బలమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరింత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
హరీశ్-పవన్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో సినీ అభిమానులకు తెలిసిన విషయమే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మరి పవన్‌కి జోడీగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం, తెలియాల్సి ఉంది.